సీఎం వైఎస్ జగన్ ను ఆహ్వానించిన.. కె రహేజా గ్రూప్ ప్రతినిధులు
విశాఖలో ఇనార్బిట్ మాల్ నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కె రహేజా గ్రూప్ ప్రతినిధులు ఆహ్వనించారు. గ్రూప్ ప్రెసిడెంట్ నీల్ రహేజా, సీఈవో రజనీష్ మహాజన్, ఆంధ్రా, తెలంగాణ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గోనె శ్రావణ్‌కుమార్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. విశాఖలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణం కోసం కె రహేజా గ్రూప్ మూడేళ్లలో రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టే విషయమై ముఖ్యమంత్రితో గ్రూప్ ప్రతినిధులు చర్చించారని పేర్కొన్నారు. పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.













