తొక్కిసలాటకు సీఎం కారణం కాదు
గోదావరి పుష్కరాలతో తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీకి నివేదిక సమర్పించింది జస్టిస్ సోమయాజులు కమిషన్. 2015 జులై 15 నాటి ఘటనపై పలుమార్లు బహిరంగ విచారణ తర్వాత నివేదికను అసెంబ్లీ ముందు ఉంచింది. దుర్ఘటనకు సీఎం కారణం కాదని నివేదికలో అభిప్రాయపడింది కమిషన్. ముఖ్యమంత్రి వెళ్లిపోయిన తర్వాత తొక్కిసలాట జరిగిందని, రాజకీయ లబ్ది కోసమే కొందరు ఆరోపణలు చేశారని వ్యాఖ్యానించింది. ప్రమాదం జరిగిన ఘాట్ వెడల్పు 300మీ. మాత్రమే ఉండటం పుష్కర ముహూర్తంపై అనవసర ప్రచారం వల్ల జనం రద్దీ పెరగడం, తదితర కారణాలతో దుర్ఘటన జరిగిందని కమిషన్ తెలిపింది. అధికారంలో లేని పార్టీలు, రాజకీయ శత్రుత్వం, ప్రతి అంశాన్ని విమర్శలకు వాడుకోవడానికి కమిషన్ గమనించింది. ముఖ్యమంత్రిని దోషిగా నిలబెట్టే ప్రయత్నాన్ని ఎక్కువమంది చేశారన్నారు. మృతులకు, బాధితులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో పరిహారం అందించిందని కమిషన్ నివేదికలో పేర్కొంది.













