హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రాకేశ్ కుమార్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రాకేశ్ కుమార్ ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం సంయుక్త కార్యదర్శి రాజీందర్ కశ్వప్ ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్ రాకేశ్ కుమార్ ఇప్పటి వరకు పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు. రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నిర్ణయం మేరకు జస్టిస్ రాకేశ్ కుమార్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. జస్టిస్ రాకేశ్ కుమార్ ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నవంబర్ 13న బాధ్యతలు స్వీకరించనున్నారు.













