టీడీపీకి 126 స్థానాలు వస్తాయని… మీ నేతలే అంటున్నారు
ఎన్నికల కమిషన్ బీజేపీకి ఏజెంట్గా మారిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషనర్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఎన్నికల తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తామన్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 126 స్థానాలు వస్తాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే చెబుతున్నారని పేర్కొన్నారు. లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి చేశారన్నారు. పేదలకోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే మళ్లీ ఆయనను గెలిపిస్తాయని అన్నారు.













