ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్డీయే కూటమి అభ్యర్థులను ఖరారు చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా ఉన్న సి.రామచంద్రయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. వారిలో ఇక్బాల్ ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేయగా, రామచంద్రయ్యపై అనర్హత వేటు పడింది. దాంతో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 12న ఉప ఎన్నిక జరగనుంది. వారిలో టీడీపీ సీనియర్ నేత సి.రామచంద్రయ్యకు ఎన్డీఏ కూటమి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. మరో స్థానాన్ని జనసేనకు కేటాయించారు. జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు రాజకీయ కార్యదర్శిగా ఉన్న పి.హరిప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.













