ఏపీ బ్రాండ్ అంబాసిడర్ రేసులో ఎన్టీఆర్, పివి.సింధు?
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ సర్కారు టూరిజం రంగంపై దృష్టి పెట్టింది. రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో కూడా అగ్రగామిగా నిలపాలన్న ప్రయత్నాల్లో భాగంగా జనాకర్షణ ఉన్న సెలబ్రిటీలను ఆంధ్రప్రదేశ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈసారి ఎవరిని అంబాసిడర్‌గా నియమిస్తారన్న దానిపై జోరుగా ఊహగానాలు సాగుతున్నాయి. బలంగా వినిపిస్తున్న ప్రచారం ఏంటంటే, టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్, బ్యాడ్మింటన్ ఆశాకిరణం పివి.సింధుల పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. జూనియర్‌కు క్లోజ్ ఫ్రెండ్ కొడాలి నాని ఇప్పుడు వైఎస్సార్సీ సర్కారులో మంత్రి అంతేకాదు, స్వయానా పిల్లనిచ్చిన మామ నార్నే శ్రీనివాసరావు కూడా వైఎస్సార్సీ నేత. దాంతో సహజంగానే ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. ఇక అంతర్జాతీయ స్థాయిలో ఘనవిజయం సాధిస్తూ, దేశంతో పాటు తెలుగు ఖ్యాతిని కూడా ఇనుమడింపచేస్తున్న పివి సింధూ కూడా ఏపీ సర్కారు దృష్టిలో ఉందని టాక్ వినిపిస్తోంది. బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ వ్యక్తి ఉంటే టూరిజం పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లోవచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.













