అప్పుడే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా : జేడీ
జనసేన పార్టీలో చేరుతున్నారన్న వార్తలపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. తనపై వస్తునన వార్తలన్నీ మీడియా సృష్టేనని కొట్టిపారేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నది వాస్తవమేనన్నారు. అయితే ఆ దరఖాస్తు మహారాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని చెప్పారు. ప్రభుత్వం ఆమోదించాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని జేడీ సృష్టం చేశారు. ఇటీవల మీడియాలో వచ్చిన కథనాలపై పవన్‌కల్యాణ్ స్పందిస్తూ, జేడీ లక్ష్మీనారాయణ వస్తే జనసేనలో చేర్చుకుంటామని స్వాగతించారు. ఈ నేపథ్యంలో జేడీ లక్ష్మీనారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.













