సొంత జిల్లా నుంచే సీబీఐ మాజీ జేడీ పోటీ?
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీనారాయణ రానున్న సాధారణ ఎన్నికలలో కర్నూలు జిల్లా నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. ఏ పార్టీలో చేరాలనే విషయమై ఇప్పటికే ఒక సృష్టతకు వచ్చిన లక్ష్మీనారాయణ త్వరలోనే బహిరంగ ప్రకటన చేయనున్నారు. వచ్చే సాధారణ ఎన్నికల, భవిష్యత్ పరిణామాలపై సృష్టతతోనే లక్ష్మీ నారాయణ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే 2019లో జరుగనున్న సాధారణ ఎన్నికలలో ఆయన సొంత జిల్లా కర్నూలు నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. అదే జిల్లాలో సురక్షితమైన నియోజకవర్గం కోసం అన్వేషణలో వున్న లక్ష్మీనారాయణ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేసిన అనంతరం ఆయన ఏ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసేది వెల్లడించనున్నారు. ఇప్పుడన్న వాటిలో భావసారూపత్య కలిగిన పార్టీలలో బీజేపీ, జనసేనలలో ఏదో ఒక పార్టీలో చేరాల్సి వుంటుంది. అయితే బీజేపీతో ఆయన ఇప్పటికే టచ్లో వున్నారని చెబుతున్నారు. కానీ సీబీఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేసినపుడు అనేక సంచనాలను కేంద్రబిందువుగా మారి రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించారు.













