వైసీపీకి ఇది సరైన సమయం…
రాష్ట్రపతి ఎన్నికలలో తమ అభ్యర్దిని గెలిపించేందుకు కావాల్సిన పూర్తి మెజారిటీ బీజేపీకి లేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికలలో గెలిచేందుకు బీజేపీకి వైసీపీ మీద ఆధారపడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చుకునేందుకు వైసీపీకి ఇది సరైన సమయమని చెప్పుకొచ్చారు. బీజేపీని ప్రత్యేక హోదా దిశగా ఒత్తిడి చేసి సాధించటంతో ద్వారా ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. దేశ వ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. వైసీపీ ప్లీనరీ తర్వాత ఆరు నెలల ముందుగానే ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం ముమ్మరమైందన్నారు. ప్రజలు రాజకీయ నాయకులను ఐదేళ్ల కోసం ఎన్నుకుంటారని, ఎన్నికల ముందుగా నిర్వహించటం వల్ల కోట్ల రూపాయాల ప్రజాధనం వృధా అవుతుందని వెల్లడిరచారు.













