టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు
టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. కడప జిల్లాలో పర్యటించిన ఆయన ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ప్రభంజనం మొదలైందని వ్యాఖ్యానించారు. అయితే ఆ ప్రభజనం ఎక్కువైనా కావచ్చు.. లేదా తక్కువైనా కావచ్చని జేసీ చెప్పుకొచ్చారు. అయితే ఇందులో ప్రతిపక్ష నేత చంద్రబాబు పరోక్షపాత్ర ఉందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆలోచనలపైనే రాష్ట్రంలో బీజేపీ ఆధారపడి ఉందని అన్నారు. ప్రధాని మోదీ ఆలోచనలపై ప్రాంతీయ పార్టీలు ఆధారపడి ఉన్నాయని ఆయన తెలిపారు. జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలు కనుమరుగేనని అన్నారు. తాను బీజేపీలో చేరే ప్రసక్తే లేదని సృష్టం చేశారు.













