జేసీ దివాకర్‌రెడ్డి సంచలన నిర్ణయం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మావాడే. నేనెప్పుడూ ఆయనను ద్వేషించలేదు. రాజకీయంగానే విమర్శించా అని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ను జేసీ కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 45 ఏళ్లుగా రాజకీయ జీవితం గడిపాను. రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న నిర్ణయానికి వచ్చాను. వాటికి ఇక గుడ్‌బై చెప్తున్నా అని జేసీ అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టానన్నారు. ప్రజల సంక్షేమానికీ కృషి చేశానన్నారు. ఈ క్రమంలో తనకు సహకరించిన అధికారులందరికీ థ్యాంక్స్ చెప్తున్నాన్నారు.













