చరిత్రలో మొదటిసారి..దేశంలో ఎక్కడా ఇలా
తెలంగాణ రాష్ట్రంలో ఒకేసారి 91 వేల ఉద్యోగాల ప్రకటన చరిత్రలో మొదటిసారని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా ఇలా జరగలేదన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌కు యూత్‌లో మంచి క్రేజ్ వస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేవని అన్నారు. మంత్రి బొత్స ప్రకటన బట్టి చూస్తే మూడు రాజధానుల అంశాన్ని సీఎం జగన్ వదిలేసినట్టే కనిపిస్తోందన్నారు. అందుకే బొత్స హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లినా వీలు కాలేదని, అపాయింట్మెంట్ ఓకే అయితే పిలుస్తామని తెలిపారు. సీఎంలను కలిసేందుకు పరిస్థితి ఒకప్పటిలా లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులకే సీఎం అపాయింట్మెంట్ ఉండటం లేదని జేసీ వ్యాఖ్యానించారు.













