నన్ను పైకి తెచ్చింది కమ్మవాళ్లే- జేసీ
టీడీపీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో హాట్ కామెంట్స్ చేశారు. పరిటాల రవితో తనకు ఎప్పుడూ విబేధాలు లేవన్నారు. ఎవరి నియోజకవర్గంలో వారు పనిచేసుకుపోయేవారిమన్నారు. పరిటాల రవి హత్య తర్వాత తాను అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకే బెంగళూరు వెళ్లానని.. తానేమీ మాయమైపోలేదన్నారు. చంద్రబాబులో కుల పిచ్చి కనిపించకపోయినా.. జిల్లాల్లో మాత్రం కుల పిచ్చి బాగా కనిపిస్తోందన్నారు జేసీ.
తనకు రెడ్డీస్ కంటే కమ్మవాళ్లే ఎక్కువ ఆప్తులు అని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. తాను పైకి రావడంలో కమ్మవాళ్లదే కీలక పాత్ర అని ఇంటర్వ్యూలో జేసీ వివరించారు. జగన్ వెళ్లే ఒక్కమాట పిలిస్తే వైసీపీ కోసం పనిచేసేందుకు వైఎస్ ఆత్మీయులు చాలా మంది ఉన్నారన్నారు. వైఎస్ చనిపోవడానికి ఒక రోజు ముందు పిలిచి త్వరలోనే మంత్రివర్గంలోకి తీసుకుంటానని హామీ ఇచ్చారన్నారు. కానీ ఆయన చనిపోవడంతో తమకు అప్పటి నుంచి మంత్రి పదవి రాకుండాపోయిందన్నారు. మనకు పదవి రాలేదని ఒకటి మీద పడి ఏడ్చే వ్యక్తిని తాను కాదన్నారు. తాను ఎవరినీ హత్యలు చేయించలేదన్నారు.
తనను నమ్ముకున్న వారు తప్పు చేసి వస్తే వారికి సాయం చేసిన మాట వాస్తవమేగానీ… ఇప్పటి వరకు చంపిరా, కొట్టి రా అంటూ ఎవరికీ తాను చెప్పలేదన్నారు జేసీ దివాకర్ రెడ్డి. జగన్, తన కుమారుడు పవన్ ఇద్దరూ క్లాస్మెట్స్ అని, వారు మంచి స్నేహితులని చెప్పారు. అయినా తన కూమారుడు కూడా టీడీపీలోనే ఉంటారని తాను భావిస్తున్నానని జేసీ చెప్పారు.













