ఆ ఘనత చంద్రబాబుదే : జేసీ
దేశంలోనే నదులను అనుసంధానం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చారు. బైరవానితిప్ప ప్రాజెక్టు వద్ద ఫైలాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జేసీ మాట్లాడారు. రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి ఇవ్వనన్ని ప్రాజెక్టులు చంద్రబాబు ఇచ్చారన్నారు. రాయలసీమ ముఖ్యమంత్రులెవ్వరు కూడా ఇదివరలో భారీ స్థాయిలో నిధులు ఖర్చుచేయలేదన్నారు. సీమప్రజలంతా చంద్రబాబుకు రుణపడి ఉండాలన్నారు. ఏపీపై కేంద్రం వివక్ష చూపుతున్నా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల సునీతలతోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.













