ఏపీ కొత్త సీఎస్ గా జవహర్ రెడ్డి.. సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటి వరకు జవహర్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉంటూనే టీటీడీ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తూ వస్తున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్‌గా జవహర్ రెడ్డి నియామక ఉత్తర్వులు నేడో రేపో అధికారికంగా తెలుస్తోంది. అంటే ఆయన రెండు, మూడు రోజుల్లో సీఎస్‌గా పదవి బాధ్యతలు స్వీకరించే అవకాశమున్నట్లు సమాచారం.













