అమరావతిలో మరో అద్భుత కట్టడం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో అద్భుత కట్టడం నిర్మాణానికి అంకురార్పణ జరగనుంది. ఇండో-జపాన్ సహకారంతో రెండు ఎకరాల్లో నిర్మించే హ్యూమన్ ప్యూచర్ పెవిలియన్కు ఈ నెల 12న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తారు. లింగాయపాలెం- కొండంరాజుపాలెం పరిధిలో ఈ భవనం నిర్మిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఏపీ సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ పరిశీలించారు. మానవీయత, వైవిధ్యం, ఆవిష్కరణ (హ్యూమానిటీ, డైవర్సిటీ, ఇన్నోవేషన్)లకు చిహ్నంగా ఈ భవనం నిలుస్తుందని శ్రీధర్ తెలిపారు. ఆయన వెంటన సీఆర్డీఏ అదనపు కమిషనర్ షణ్మోహన్, ల్యాండ్ డైరెక్టర్ బీఎల్ చెన్నకేశవరావు, సీఈ జక్రయ్య, ఎస్ఈ సీహెచ్ ధనుంజయ, తూళ్ళూరు డివిజన్ ఏఎస్పీ కృష్ణారావు ఉన్నారు.













