ఏపీలో జనతా కర్ఫ్యూ…దుకాణాలు బంద్, బయటకు రాని జనం
ఆంధప్రదేశ్‌లో జనతా ‘జనతా కర్ఫ్యూ’ విజయవంతమైంది. అన్నీచోట్లా ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూను విజయవంతం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, వ్యాపారవర్గాలు జనతా కర్ఫ్యూలో పాల్గొన్నాయి. స్వచ్చందంగా సేవలు నిలిపివేసిన పెట్రోల్ బంకులు, ఆర్టీసి బస్టాండ్లలో నిలిచిపోయిన బస్సు సర్వీసుల విజయవాడ, తిరుపతి, విశాఖ, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు నగరాలతో పాటు అన్ని ప్రధాన పట్టణాల్లో మాల్స్ మూతపడ్డాయి. మద్యం దుకాణాలు, బార్లు మూత పడ్డాయి. పర్యాటక ప్రాంతాలను తాత్కలికంగా అధికారులు మూసివేశారు. బొర్రా గుహలు, శ్రీశైలం రోప్‌వే, విజయవాడ భవానీద్వీపం తదితర ప్రముఖ ప్రాంతాల్లో ఈ నెల 31వ తేదీ వరకు పర్యాటకులకు అనుమతిని అధికారులు నిరాకరించారు.
అన్ని ప్రముఖ దేవాలయాల్లోనూ భక్తులకు అనుమతి రద్దు చేశారు. ప్రైవేటు ట్రావెల్స్ సర్వీసులను స్వచ్చందంగా రద్దు చేశాయి. ‘జనతా కర్ఫ్యూ’ కు మద్దతుగా హోల్ సేల్ మార్కెట్లు మూతపడ్డాయి. విజయవాడలోని వస్త్రలత మార్కెట్‌ను 31వరకు మూసి వేయనున్నట్లు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రైతు బజార్లు, మార్కెట్లలో స్వచ్చందంగా రైతులు, వ్యాపారులు ‘జనతా కర్ఫ్యూ’ పాటిస్తున్నారు. జనతా కర్ఫ్యూలో భాగంగా విజయవాడ హోల్ సేల్ కూరగాయల మార్కెట్ నిర్మానుష్యంగా మారింది.
రాష్ట్రం వ్యాప్తంగా కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణలో భాగంగా ‘జనతా కర్ఫ్యూ’ కు మంచి స్పందనే వచ్చిందని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని చెప్పారు. కరోనా వైరస్ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నామని ఆమె తెలిపారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉన్నారని నీలం సాహ్ని పేర్కొన్నారు. వైద్య శాఖ నిరంతరం పనిచేస్తోందని ఆమె తెలిపారు. జనవరి 17 నుంచి కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని ఆమె వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించామని నీలం సాహ్ని చెప్పారు. ప్రజలందరూ ‘జనతా కర్ఫ్యూ’లో పాల్గొన్నారని ఆమె తెలిపారు. ప్రభుత్వ చర్యలకు ప్రజలు కూడా సహకరిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
ఈ వార్తకు సంబంధించిన ఫోటోలు న్యూస్బజార్ 9.కమ్ సౌజన్యంతో ఇక్కడ ఇస్తున్నాము.
Click here Photogallery for Janata Curfew in AP
Click here Photogallery for Janata Curfew in Telangana
Click here Photogallery for Janata Curfew in India













