Janasena :జనసేన ఆధ్వర్యంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు
జనసేన నేతలు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తో పాకిస్థాన్ (Pakistan)కు గట్టి గుణపాఠం చెప్పిన మన దేశ సైన్యానికి, నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలని కోరుతూ షష్ట షణ్ముఖ క్షేత్రాలు, ఇతర ఆలయాల్లో పూజలు చేయాలని ఆ పార్టీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీకనకదుర్గమ్మకు మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar), ఎమ్మెల్సీ హరిప్రసాద్ (Hariprasad) ప్రత్యేక పూజలు చేశారు. కర్ణాటకలోని ఘాటీ సుబ్రహ్మణ్య క్షేత్రంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ (Bathula Balaramakrishna ) ఆధ్వర్యంలో నేతలు అర్చన, అభిషేకాలు, కల్యాణోత్సవం నిర్వహించారు. దేశ సైన్యానికి దైవబలం మెండుగా ఉండాలని ప్రార్థించారు.













