వారికే ఈ సభ అంకితం చేస్తున్నాం : నాదెండ్ల మనోహర్
కరోనా వేళ జన సైనికులు అనేక ప్రాంతాల్లో అందించిన సేవా కార్యక్రమాలు అపూర్వమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కొనియాడారు. జనసేన ఎనిమిదో ఆవిర్భావ దినోత్స సభ తాడేపల్లి మండలంలోని ఇప్పటంలో నిర్వహించారు. దామోదరం సంజీవయ్య వేదికగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ కొవిడ్ మహమ్మారితో మృతి చెందిన వారికి సభా వేదిక నుంచి సంతాపం ప్రకటించారు. రోడ్డు ప్రమాదాల్లో, అనారోగ్యం వల్ల, ప్రజా సేవలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఈ సభను అంకితం చేస్తున్నట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు అండగా నిలబడతామన్నారు.













