వారాహిని అడ్డుకునే దమ్ము వైసీపీకి ఉందా ?
వచ్చే ఎన్నికలో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం ఖాయమని జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వారాహిని అడ్డుకునే దమ్ము వైసీపీ కార్యకర్తలకు ఉందా? అని ప్రశ్నించారు. మంత్రులు అంబటి రాంబాబు, రోజాలు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. మంత్రి రోజా బాగోతం అందరికీ తెలుసు అన్నారు. వైసీపీ కేబినెట్లోనే అవినీతి మంత్రి రోజా అని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో రోజా గెలిచే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. రోజా గెలిస్తే ఆమె ఇంటి ముందు గుండు గీయించుకుంటానని సవాల్ విసిరారు. రోజా ఓడిపోతే గుండు గీయించుకుంటారా? అని ప్రశ్నించారు.













