ముందు ఆ డిమాండ్ చేసి… చంద్రబాబు గురించి మాట్లాడాలి
తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను తిట్టినా మంత్రి గుడివాడ అమర్నాథ్కు ముఖ్యమంత్రి జగన్ సీట్ ఇవ్వలేదని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఎద్దేవా చేశారు. అందుకే ఇప్పుడు చంద్రబాబుని తిట్టడం మొదలుపెట్టారని తెలిపారు. సీటు రాకపోతే నారా లోకేశ్‌ను, దేవాన్ష్‌ను కూడా తిడతారేమోనని వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి అమర్నాథది పేరుకే పరిశ్రమల శాఖ, కానీ ఆయనకు పవన్‌ను విమర్శించే శాఖ ఇచ్చారు. 11 కేసుల్లో ఏ1గా ఉన్న జగన్ కోర్టుకు వెళ్లడం లేదు? ప్రశ్నించారు. బెయిల్ పై బయటకు ఉంటూ తన బాబాయి హత్యలో కీలక పాత్ర పోషించారు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ ఉన్న పార్టీ వైసీపీ. కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీను ఐదేళ్లలో నుంచి జైల్లో మగ్గిపోతున్నాడు. ఈ కేసులో సాక్షిగా ఉన్న జగన్ కోర్టుకు వెళ్లాలని అమర్ డిమాండ్ చేయాలి. ముందు ఆ డిమాండ్ చేసి చంద్రబాబు గురించిం మాట్లాడాలి. 125 అడుగులు అంబేడ్కర్ విగ్రహం పెడుతున్నామని గొప్పలు చెబుతున్నారు. ఒక దళిత బిడ్డ కోసం పది నిమిషాలు కేటాయించని సీఎం కోసం అమర్ మాట్లాడటం దారుణం. ఎక్కడ పోటీ చేసినా ఆయన ఓటమికి ప్రతి జైన సైనికుడూ పనిచేస్తారు అని అన్నారు.













