రాయలసీమపై మీకు ప్రేమ ఉందా ?
రాయలసీమపై మీకు ప్రేమ ఉందా? అని ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. కర్నూలులోని యుబీఆర్ కన్వెన్షన్ హాల్లో విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్కు రాయలసీమపై ప్రేమ ఉంటే ఇక్కడి ప్రజల సమస్యలపై ఎందుకు పోరాటం చేయడం లేదన్నారు. ఎన్నుకున్న ప్రజలు సమస్యలపై ప్రభుత్వాలను నిలదీసేందుకు చట్టసభలకు ఎందుకు వెళ్లడం లేదని వైసీపీనీ ప్రశ్నించారు. మన భయమే రౌడీలు, గూండాలకు బలమని, వారిని ధైర్యంగా ఎదుర్కోవాలని పవన్ సూచించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేద్దామని వచ్చిన జయప్రకాశ్ నారాయణను, చిరంజీవిని తొక్కేశారు. మీరు నిలబడతారా? అని అన్నారు. ఏపీ రాజదానిగా అమరావతి కన్నా తన మనసులో ర్నూలు రాజధాని అనే భావన ఉందన్నారు. అనంతరం ఆదోని పత్తి మార్కెట్ యార్డులో రైతులతో పవన్ ముఖాముఖి నిర్వహించారు.













