జనసేన శిబిరాలు విజయవంతం
ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు జిల్లాలతోపాటు, తెలంగాణ రాజధాని గ్రేటర్ హైదరాబాద్‌లో జనసేన పార్టీ నిర్వహించిన జన సైనికుల ఎంపిక శిబిరాలు విజయవంతమయ్యాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పార్టీ ఎంపిక శిబిరాలను విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. జనసేన తలపెట్టిన ఈ యజ్ఞంపై అభిమానులు చూపుతున్న ఆదరాభిమానాలు తనలో మరింత శక్తిని నింపుతున్నాయని పేర్నొన్నారు. ప్రజల ప్రోత్సాహంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని మిగిలిన జిల్లాల్లో జనసైనికుల ఎంపిక మరింత వేగవంతం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, కడప, కర్నూలు, గుంటూరు, కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాలు, తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగిలిన జిల్లాలకు చెందిన ఔత్సాహికులు ఆన్‌లైన్‌ద్వారా తమ దరఖాస్తులను పంపవచ్చని సూచించారు. వక్త, రచయిత, విశ్లేషకుల విభాగాలకు ఆన్లైన్లో దరఖాస్తులు పంపించేందుకు జనసేన వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలని పవన్ సూచించారు.













