28 మంది ఎంపీలతో సాధించింది శూన్యం : పవన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 28 మంది ఎంపీలతో వైసీపీ సాధించింది శూన్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ నిధుల సాధనలో ఎందుకింత ఆలసత్వమని ప్రశ్నించారు. జాతీయ ప్రాజెక్ట్ హోదా ఉన్న పోలవరానికి 2022`23 బడ్జెట్లో కేటాయింపులు కనిపించలేదన్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద పోలవరం ప్రాజెక్ట్ గురించి కనీసం ప్రస్తావిస్తున్నారా లేదా అనే సందేహం వస్తోందని అన్నారు. 22 మంది వైసీపీ లోక్సభ సభ్యులు ఆరుగురు వైసీపీ రాజ్యసభ సభ్యులు ఢల్లీిలో ఏం సాధించారని పవన్ ప్రశ్నించారు.













