20 నుంచి జనసేన పోరాట యాత్ర
ఈ నెల 20 నుంచి జనసేన పోరాట యాత్రను ప్రారంభిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఇచ్చాపురం తీరప్రాంతం నుంచి పోరాట యాత్రను ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ 45 రోజుల పాటు జనసేన పోరాట యాత్రను కొనసాగిస్తామని తెలిపారు. జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కవాతు నిర్వహిస్తామన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా, ఇతర హామీలు కేంద్రం నెరవేర్చలేదని పవన్ మండిపడ్డారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం బాధాకరమన్నారు. రాజకీయ జవాబుదారీతనం ఉండే ప్రభుత్వాలు రావాలని ఆయన సూచించారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సమస్యలను గుర్తించి, అధ్యయనం చేసి వాటి పరిష్కార మార్గాలు చూపుతామన్నారు.













