14న జనసేన ఆవిర్భావ సభ
జనసేన పార్టీని 2014 మార్చి 14న స్థాపించారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించేందుకు జనసేన సమాయత్తమవుతోంది. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సభ నిర్వహించనున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు. విశాలమైన ఈ ప్రాంగణంలో అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు తమ ప్రతినిధులు తలమునకలై ఉన్నారని పేర్నొన్నారు. ఈ సభలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనాలని, అందరికీ ఇదే తన ఆహ్వానమని పేర్కొన్నారు. రాజమండ్రి సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పదిహేను మంది సభ్యులతో కూడిన ఓ కమిటీ ఏర్పాటు చేసినట్టు చెప్పారు.













