జనసేన పార్టీకి గుడ్ న్యూస్.. మరోసారి
జనసేన పార్టీకి గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం. గ్లాస్ గుర్తును జనసేన పార్టీకే కేటాయించింది. జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా మరోసారి గ్లాస్‌ను కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. గ్లాస్ గుర్తును కేటాయించిన ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా మరోసారి గ్లాస్ కేటాయించినందుకు ఎన్నికల సంఘానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జరిగిన గత సార్వత్రిక ఎన్నికలలో జనసేన అభ్యర్థులు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేసిన సంగతి తెలిసిందే.













