వందరోజుల పాలన ప్రణాళికాబద్దంగా లేదు : జనసేన
రాష్ట్రంలో ఇసుక విధానం పెట్టుబడులు ఆకర్షించడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని జనసేన విమర్శించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్యం పడకేసిందని, పోలవరం నిలిచిపోయిందని ఆరోపించింది. వైకాపా 100 రోజుల పాలనపై రూపొందించిన నివేదికను ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. వైకాపా పాలనలో పారదర్శకత, దార్శనికత లోపించినట్లు తమ నివేదిక తేల్చింది. వంద రోజుల పాలన ప్రణాళికబద్ధంగా లేదని, డెండీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణలో సన్నద్ధత లోపించిందని విమర్శించింది. ఇసుక విధానం, పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం విఫలమైందని రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినట్లు జనసేన తన నివేదికలో పేర్కొంది. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన లేదని, ప్రజారోగ్యం పడకేసిందని, ప్రభుత్వ చర్యల కారణంగానే పోలవరం నిలిచిపోయిందని నివేదిక వెల్లడించింది.













