టీడీపీ నెత్తిన పాలు పోసిన పవన్…?
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కొన్ని కొన్ని అవకాశాలు ఆ పార్టీ ఊహించని విధంగా వస్తున్నాయి అనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అధికార పార్టీ చాలా బలంగా ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా చాలా బలంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని ఇబ్బందులను చంద్రబాబునాయుడు ఎదుర్కొంటున్నారు కూడా. అయితే ఇప్పుడు ఇతర పార్టీల నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి కొన్ని సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.
ప్రధానంగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కారణంగా కొన్ని ఇబ్బందులు తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటుంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కొన్ని కీలక నియోజకవర్గాల్లో కొన్ని పంచాయతీల కోల్పోవడానికి ప్రధాన కారణం జనసేన అనే అభిప్రాయం కొంతమంది లో ఉంది. జనసేన పార్టీ కొన్ని సామాజిక వర్గాలను తమ వైపు తిప్పుకోవడం తో తెలుగుదేశం పార్టీ నేతలు కాస్త ఇబ్బంది పడ్డారు అని చెప్పాలి. అందుకే కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ పరోక్షంగా జనసేన పార్టీకి కూడా మద్దతు ఇచ్చిందని కొంతమంది విశ్లేషకులు మీడియా సమావేశంలో వ్యాఖ్యలు చేశారు.
అయితే ఇప్పుడు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నెత్తిన పాలు పోసింది అనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఏంటనేది ఒకసారి చూస్తే తిరుపతిలో తెలుగుదేశం ఎలాగైనా సరే గెలిచే విధంగా వ్యూహాలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్న తరుణంలో అక్కడ జనసేన పార్టీ కూడా పోటీ చేసే ఆలోచనలో ఉంది అని ప్రచారం జరిగింది. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ మధ్య దీనికి సంబంధించి ఎన్నో చర్చలు జరగగా చివరకు జనసేన పార్టీ పోటీ నుంచి తప్పుకుని భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
దీనికి సంబంధించి శుక్రవారం సాయంత్రం పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు నిర్ణయం తీసుకున్నారు. అయితే తిరుపతిలో ఒకవేళ జనసేన పార్టీ పోటీ చేసి ఉంటే తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వ వ్యతిరేక ఓటు కొంత దూరం అయ్యే అవకాశం ఉండేది. అలాగే తిరుపతి పార్లమెంటు పరిధిలో ఎక్కువగా ఉన్న కాపు సామాజిక వర్గ ఓటర్లు దాదాపుగా జనసేన పార్టీ వైపు చూసే పరిస్థితి ఉండేది. దళితుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని తెలుగుదేశం పార్టీ అంటోంది.
అది కొంతవరకు నిజమే అయితే ఆ ఓట్లలో సగం జనసేన పార్టీ కి వెళ్లి ఉండేవి. కానీ ఇప్పుడు జనసేన పార్టీ పోటీ చేయకపోవడంతో ఆ ఓట్లు తెలుగుదేశం పార్టీకి దాదాపుగా పడే అవకాశాలు ఉండవచ్చు. వాస్తవానికి చిత్తూరు జిల్లా నెల్లూరు జిల్లాలో అధికార పార్టీపై వ్యతిరేకత ఉందనే భావన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో కూడా కాస్త ఇబ్బందికరంగా అధికార పార్టీ నేతలు ప్రవర్తించడంతో ప్రజల్లో కూడా ఒక రకమైన ఆందోళన వ్యక్తమైంది. అయితే భారతీయ జనతా పార్టీకి ఓటు వేసే అవకాశం వుండకపోవచ్చు.
జనసేన పార్టీ మద్దతు ఇచ్చినా సరే వాళ్ళు మాత్రం బీజేపీ మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో గానీ రాష్ట్రానికి నిధులు విడుదల చేసే విషయంలో భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు ఇబ్బందికరంగా ప్రవర్తించడంతో ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అమరావతికి బిజేపి మద్దతు ఇచ్చినా పెద్ద ప్రయోజనంలో లేదు.













