కరోనా నుంచి దృష్టి మళ్లించేందుకే… డైవర్షన్ పాలిటిక్స్
కరోనా వైరస్ కట్టడి వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే రాష్ట్ర ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ సమస్యలన్నింటినీ దారి మళ్లించేందుకు మొన్న టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను అక్రమంగా అరెస్టు చేశారు. ఇప్పుడు విశాఖలో పల్లా శ్రీనివాస్ ఆస్తులను ధ్వంసం చేశారు. రేపు రాయలసీమలో ఏముంతుందో తెలీయదు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పల్లా శ్రీనివాస్ ఆస్తునలు ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అని పేర్కొన్నారు. ప్రజలకు ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క మరణాలు విపరీతంగా పెరగుతున్నాయి. వ్యాధి నిర్ధారణ ఫలితాలు కూడా సమయానికి ఇవ్వడం లేదు. ఆక్సిజన్, మందులు, వ్యాక్సిన్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారు.













