డబల్ సెంచరీ నా లక్ష్యం..జగన్..
రాబోయే ఎన్నికలలో 175 కు 175 ఎమ్మెల్యే సీట్లు, 25 కు 25 ఎంపీ సీట్లు గెలవాలి అనేదే తన కోరిక అని సీఎం జగన్ అన్నారు. ఈసారి ఎన్నికల్లో డబల్ సెంచరీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ కార్యకర్త లో జోష్ నింపుతున్నాడు జగన్. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఈరోజు మదనపల్లి లో నిర్వహించిన సభలో ప్రసంగించిన జగన్ ప్రతిపక్ష పార్టీలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తామ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో 99% అమలు చేశామని.. విశ్వసనీయమైన పాలన ఎలా ఉంటుందో ప్రజలకు చూపించామని అన్నారు. జెండాలు జతకట్టి అబద్దాలతో వస్తున్న వారిని నమ్మద్దని.. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం తనకి ఉందని జగన్ పేర్కొన్నారు. తన ఒక్కడి మీద ఎంతమంది కలిసి దాడి చేస్తున్నారు గమనించాల్సిందిగా ప్రజల్ని కోరారు. 10 శాతం హామీలు కూడా నెరవేర్చని చంద్రబాబు తన మీద ఇలా మాట్లాడడం సబబుగా లేదు అని అన్నారు. విపక్షాల పొత్తులు చూసి భయపడాల్సిన అవసరం లేదని.. ఈసారి డబల్ సెంచరీ కి తాము సిద్ధమని పేర్కొన్నారు.













