మాది పేదల పార్టీ.. మీది పెత్తందార్ల పార్టీ.. జగన్
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఈరోజు సీఎం జగన్ తిరుపతి జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన చిన్న శింగనమల లో ఆటో, టిప్పర్ డ్రైవర్లతో ముఖాముఖి సమావేశమయ్యారు. వారితో ముచ్చటిస్తున్న జగన్ ఈ సందర్భంగా అనంతపురం జిల్లా శింగనమల వైసీపీ బలపరిచిన వీరాంజనేయులు గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. తమ కాండిడేట్ ఎంఏ ఎకనామిక్స్ చదివాడని, చంద్రబాబు హయాంలో యువతకు ఉద్యోగాలు రాకపోవడంతో కుటుంబ పోషణ నిమిత్తం డ్రైవర్ గా మారాడని సీఎం జగన్ చెప్పారు. ఇటువంటి కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తులకు టికెట్ ఇచ్చినందుకు టీడీపీ నేతలు తమని అవహేళన చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలియపరిచారు. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా స్పందించిన జగన్. “నేను ఒక టిప్పర్ డ్రైవర్ కు సీట్ ఇచ్చాను అని చంద్రబాబు అవహేళన చేశారు. అతని వేలిముద్ర గాడు అని కూడా అన్నారు. మీరంటే కోట్లకు కోట్లు డబ్బులు ఉన్న పెత్తందారులకే టికెట్లు ఇస్తారు.. కానీ మేము మీలా కాదు.. మేము పేద వాళ్లకు టికెట్ ఇచ్చి గెలిపించే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాము” అంటూ ట్వీట్ చేశారు.













