పిఠాపురం తో ప్రచారానికి ఫైనల్ టచ్ ఇవ్వనున్న జగన్..
ఆంధ్రాలో ఈసారి ఎన్నికలు మునుపెన్నడూ లేనంత ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రచారం తుది దశకు చేరుకున్న ఈ సమయంలో ఏపీ లో నాయకుల హడావిడి ఎక్కువైపోయింది. గెలుపే లక్ష్యంగా ప్రచారంలోకి దిగిన ప్రధాన పార్టీలు కొన్ని రోజులుగా హామీలతో మోత మోగిస్తున్నారు. ఈరోజు ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో సాయంత్రం 6 గంటలకల్లా ఎక్కడి మైకులు అక్కడ మూగబోతాయి. ఈ నేపథ్యంలో జగన్ తన చివరి ప్రచారాన్ని జనసేనాని అడ్డ ఆయన పిఠాపురం నుంచి నిర్వహించబోతున్నారు. ఈరోజు జగన్ మొత్తానికి మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ప్రచారం సాగిస్తారు. ఉదయం 10 గంటలకు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో చిలకలూరిపేట కళామందిర్ సెంటర్ నుండి మొదలయ్యే జగన్ ప్రచారం.. మధ్యాహ్నం ఒంటిగంటకు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కైకలూరుకు చేరుకుంటుంది. ఆ తర్వాత జగన్ ప్రచారానికి ఫినిషింగ్ టచ్ పిఠాపురంలో నిర్వహించే సభ తో ఉంటుంది. మామూలుగానే తన ప్రచార ప్రసంగాలలో పవన్ పై విరుచుకుపడే జగన్.. పిఠాపురంలో ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.













