జమ్మలమడుగు నుంచి జగన్ ముహూర్తం పెడతారా…?
వర్గ విభేదాలు అనేది ఏ పార్టీని అయినా సరే ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనే విషయం అందరికీ తెలిసిందే. వర్గ విభేదాలు విషయంలో చాలామంది రాజకీయ పార్టీల అధినేతలు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు మనం చూస్తూనే ఉంటాం. రాజకీయంగా కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నా కొంతమంది నుంచి అనుకున్న విధంగా ప్రోత్సాహం లేకపోవడంతో రాజకీయ పార్టీల నేతలు కూడా ఇబ్బందులు పడుతుంటారు. ఇక పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమస్యలు ఎప్పుడూ ఉంటాయి.
నియోజకవర్గాల ఇన్చార్జిలు ఎమ్మెల్యేలకు మధ్య గొడవలు మనం చూస్తూనే ఉంటాం. జిల్లాల ఇన్చార్జిలు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు మధ్య విభేదాలు ఉంటాయి. మంత్రులకు ఎంపీలకు మధ్య సమస్యలుంటాయి… ఇన్చార్జి మంత్రులకు… జిల్లా మంత్రులకు మధ్య ఎన్నో సమస్యలు కూడా మనం చూస్తూనే ఉంటాం. ఎంపీలకు ఎమ్మెల్యేలకు మధ్య సమస్యలు ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి వాటిని పరిష్కరించుకునే విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది.
అయితే 2019 తర్వాత ముఖ్యమంత్రి వైయస్ జగన్ వాటి మీద దృష్టి పెట్టలేదు అనే ఆరోపణలు ఎక్కువగా వినిపించాయి. కానీ ఇప్పుడు మాత్రం జగన్ కచ్చితంగా వీటిమీద ఫోకస్ పెట్టారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జమ్మలమడుగు నియోజకవర్గం లో సమస్యలను పరిష్కరించే విషయంలో పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. నియోజకవర్గంలో రామసుబ్బారెడ్డి అలాగే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కి మధ్య విభేదాలు ఉన్నాయి. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది ఇద్దరి మధ్య. గత కొన్ని రోజులుగా విభేదాలు నడుస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఒక వ్యక్తి హత్య కూడా నియోజకవర్గం లో సంచలనం సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా హత్య గురించి అందరూ మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. దీనితో ఇప్పుడు పార్టీ అధిష్టానం రంగంలోకి దిగి దానిమీద దృష్టి సారించి సమస్య దాదాపుగా పరిష్కరించి రామసుబ్బారెడ్డిఐ 2023లో ఎమ్మెల్సీ పదవి ఇస్తామని స్పష్టం గా చెప్పింది. సుధీర్ రెడ్డి 2024 ఎన్నికల్లో కచ్చితంగా అదే నియోజకవర్గం నుంచి సీటు ఉంటుందని కూడా పేర్కొంది. ఇదే పనిని అన్ని నియోజకవర్గాల్లో కూడా చేయాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పార్టీలో విభేదాలు పెరగటంతో చాలామంది నాయకులు పార్టీ కోసం పని చేయడానికి ముందుకు రావడం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ సమస్యలను నియోజకవర్గాల్లో పరిష్కరించుకుని నేతల మధ్య దూరాన్ని తగ్గించగలిగితే 2024 ఎన్నికల్లో వైసీపీ గెలుపు పెద్ద సమస్య కాదు.













