Arjun Reddy: వైఎస్ జగన్ బంధువు అర్జున్ రెడ్డి అరెస్ట్
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బంధువు సిరిగిరెడ్డి అర్జున్ రెడ్డి (Arjun Reddy) ని కృష్ణా జిల్లా గుడివాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ ( Pawan), మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh), వారి కుటుంబసభ్యుల ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారనే కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఇటీవల పోలీసులు అర్జున్‌రెడ్డికి నోటీసులు ఇచ్చారు. దీంతో నేడు ఆయన గుడివాడ టూటౌన్ పీఎస్‌కు రాగా అరెస్ట్ చేశారు. గతంలో అర్జున్‌రెడ్డిని అరెస్ట్ చేసందుకు యత్నించగా విదేశాలకు పరారయ్యారు. దీంతో పోలీసులు ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు.






