ప్రమాణస్వీకార ఏర్పాట్లపై వైఎస్ జగన్ సమీక్ష
ఈ నెల 30న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న ప్రమాణస్వీకార ఏర్పాట్లపై వైఎస్ జగన్ దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, డీజీపీ ఆర్పీ ఠాకూర, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారక తిరుమల రావు, ట్రాఫిక్ డీసీపీ, పోలీసు అధికారులు సహా కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ రామారావు తదితరులు పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు, పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివస్తున్నందున ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులు జగన్ ఆదేశించారు. తాము తీసుకుంటున్న చర్యలను ఉన్నతాధికారులు జగన్కు వివరించారు.













