సోషల్ మీడియా క్లాసులు పెట్టే యోచనలో జగన్…?
సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా వరకు సీరియస్ గా ఉన్నా సరే కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన లోపాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్న వైసీపీ నేతలు మాత్రం జాగ్రత్తలు తీసుకోలేకపొతున్నారు. దీని వలన సమస్యలు తీవ్రంగా పెరుగుతున్నాయి. సంక్షేమ కార్యక్రమాలు బలంగా తీసుకుని వెళ్ళవలసిన తరుణంలో చాలా వరకు కూడా వైసీపీ నేతలు విఫలమవుతున్నారని చెప్పాలి.
ముఖ్యంగా విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టింది. వీటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదు. సోషల్ మీడియాలో కూడా చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు యాక్టివ్ గా కనబడటం లేదు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలు మాత్రం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. 2014 నుంచి 19 వరకు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దూరంగా జరిగారు.
దీని కారణంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లడం లేదు అనే ఆవేదన ముఖ్యమంత్రి జగన్ లో ఎక్కువగా ఉంది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియా విషయంలో జగన్ చాలావరకు జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలు ప్రజల్లోకి వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజల్లోకి వెళ్లే విధంగా జగన్ కొన్ని చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని వైసీపీ వర్గాలంటున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రులకు సోషల్ మీడియా క్లాసులు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం.
దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సోషల్ మీడియా బాధ్యతల విషయంలో కాస్త స్పీడ్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి సోషల్ మీడియా బాధ్యతలను ఆయనకు అప్పగించే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్లుగా తెలుస్తుంది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి ప్రధాన కారణం సంక్షేమ కార్యక్రమాలు ప్రజలలోకి వెళ్లకపోవడమే. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చంద్రబాబు నాయుడు ఎన్నో కార్యక్రమాలు అమలు చేసారు.
అయినా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ప్రజల్లోకి తీసుకెళ్లేలేకపోయారు. ఇప్పుడు అదే ఇబ్బంది ముఖ్యమంత్రి జగన్ కి కూడా వస్తుంది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియా క్లాసులు నిర్వహించాలని నియోజకవర్గాల వారీగా ఈ క్లాసులు నిర్వహిస్తే బాగుంటుంది అనే భావనలో ముఖ్యమంత్రి జగనన్ ఉన్నారు. ఇన్చార్జి మంత్రులకు ఈ బాధ్యతలను అప్పగించాలని అవసరమైతే పార్టీ తరఫున ఒక ప్రత్యేక టీమ్ ని కూడా ఏర్పాటు చేసి సోషల్ మీడియా క్లాసులు నిర్వహించాలి అని భావిస్తున్నారు. వారంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం జగన్ లో ఉందట.













