షర్మిల దెబ్బకు అవినాష్ టికెట్ గల్లంతేనా.. వైసీపీ కడప ఎంపీ అభ్యర్థి ఎవరు?
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయాలు మొత్తం ఒకెత్తయితే కడప కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలు మరొక ఎత్తు. మరి ముఖ్యంగా వైఎస్ షర్మిల ఎంట్రీ తర్వాత కడపలో కుటుంబ కలహాలు ఎక్కువైపోయాయి. కాంగ్రెస్ తరఫున కడప ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిల.. వివేకా హత్య కేసును అస్త్రంగా వాడుకొని వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి పై ఎదురు దాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితులను తమకు వ్యతిరేకంగా మారకుండా ఉంచడం కోసం వైసీపీ ఎంపీ అభ్యర్థిని మారుస్తారనే ప్రచారం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే కడప వైఎస్ కుటుంబానికి కంచుకోట.. షర్మిల కు వ్యతిరేకంగా బయట వ్యక్తిని నిలబెడితే విజయం ఏకపక్షం అయిపోతుంది. ఎందుకంటే అక్కడ పార్టీ ఎవరిది అనేది ఎవరు పట్టించుకోరు.. రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఒకవైపు.. వేరొక వ్యక్తి మరొకవైపు అన్న వైఖరిలో ఓట్లు వేసే ఆస్కారం ఉంది. అందుకే వైయస్ కుటుంబానికి చెందిన అభిషేక్ రెడ్డి ని అభ్యర్థిగా నిలబెట్టడానికి జగన్ ఆలోచిస్తున్నట్లు టాక్. అవినాష్ రెడ్డిని వెనక వేసుకురావడం వల్ల ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఒకపక్క.. షర్మిల మరొక పక్క.. సునీత వేసే నిందలు ఎదుర్కోవల్సి వస్తోంది. షర్మిల వివేకాను చంపిన అవినాష్ ని గెలిపిస్తారా.. న్యాయం కోసం పోరాడుతున్న రాజశేఖర్ రెడ్డి బిడ్డను నన్ను గెలిపిస్తారా అని సెంటిమెంట్‌తో ప్రజలపై దాడి చేస్తున్నారు. ప్రజలలో ప్రతికూల భావం ఎక్కువ కాకూడదు అనే ఉద్దేశంతో అభ్యర్థిని మార్చడానికి జగన్ సిద్ధపడ్డట్టు తెలుస్తోంది. అయితే జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత ఉంది అన్న విషయం అధికారికంగా ప్రకటన విడుదలయితే తప్ప తెలియదు.













