‘ఏఏఏ… రానీయమ్మ…’ ఇది పాట కాదు బ్రో..
జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యర్థుల పై మాటల తూటాలు పేల్చడం మనం ఇప్పటి వరకు చూస్తూ వస్తున్నాం. అయితే రీసెంట్ గా ఒక సభలో జరిగిన చిన్ని సంఘటనను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ప్రత్యర్ధులు. ‘ఏఏఏ… రానీయమ్మ… రానియమ్మ… బాబుని రానీయమ్మ…” అంటూ జగన్ మొన్న శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సభలో అన్నారు. జగన్ తో సెల్ఫీ తీసుకోవడం కోసం వస్తున్న ఒక అభిమానిని పోలీసులు ఆపడం తో ఆయన అలా స్పందించారు. ఆ అబ్బాయిని పిలిపించుకొని సెల్ఫీ కూడా దిగారు. అయితే ఆయన ఆ మాటలు పలికిన తీరు కాస్త విచిత్రంగా ఉండడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాకుండా ఇన్నాళ్లుగా జగన్ చాలా వరకు తన బటన్ నొక్కుడు పర్యటనలకు వెళ్లే సమయంలో రోడ్డుకు రెండు వైపులా పరదాలు ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్న ఈ తరుణంలో పరదాలు దాటి ప్రజల మధ్యకు వచ్చినట్లు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జగన్ ప్రవర్తన గురించి సోషల్ మీడియా లో పెద్ద చర్చ జరుగుతుంది.













