YS Sharmila : ఆ కుటుంబాన్నికి రూ.10 కోట్లు పరిహారం ఇవ్వాలి : షర్మిల
పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ఏటూకూరు బైపాస్ వద్ద చీలి సింగయ్య (Singayya) మృతికి ముమ్మాటికీ జగన్ (Jagan )నిర్లక్ష్యమే కారణమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) విమర్శించారు. తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ చేసిన తప్పిదానికి క్షమాపణ చెప్పకుండా ఫేక్ వీడియో (Fake video) అని మభ్యపెట్టడం దారుణమన్నారు. మానవత్వం ఉంటే రూ. 5 కోట్లో, రూ.10 కోట్లో పరిహారం ఇచ్చి క్షమించమని అడగాలి గానీ, ఐదేళ్లు నిద్రపోయి, ఇప్పుడు ప్రజా ససమ్యలంటూ బయల్దేరడం విడ్డూరంగా ఉందన్నారు.
జగన్‌వి బలప్రదర్శన, జన సమీకరణ కార్యక్రమాలు తప్ప ప్రజల కోసం కాదు. డబ్బుంది, బలముందని జగన్ నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన జనసమీకరణాలకు అనుమతులు ఇవ్వొద్దని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఘటన జరిగిన సమయంలో కారులో ఉన్న వారందర్నీ విచారణకు పిలవాలి. కారు (Car) కింద ఓ మనిషి పడిపోయాడని కనీస స్పృహ లేదు. కారులో ఉన్న వాళ్లు అలాగే ముందుకు వెళ్లడం దారుణం అని అన్నారు. తప్పు జరిగితే ఒప్పుకోకుండా ఫేక్ అంటూ సమర్థించుకుంటా రా? జగన్ సైడ్ బోర్డ్ మీద నిలబడి జనాలకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆయన పర్యటనకు అనుమతి ఇచ్చింది దాదాపు 5 వాహనాలకే. కానీ 50 వాహనాల్లో వెళ్లి సైడ్ బోర్డుపై నిలబడి షేక్ హ్యాండ్ ఇస్తారా? ఇది జగన్ తప్పు కాదా? జగన్‌కి మానవత్వం అనే పదానికి అర్థం తెలియదు. మానవత్వం ఉంటే సింగయ్యను ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లలేదు. ఆ కుటుంబాన్ని ఇప్పటి వరకు ఎందుకు పరామర్శించలేదు? ఆ కుటుంబానికి జగన్ కనీసం రూ.10 కోట్లు పరిహారం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.













