Atchannaidu: జగన్ హయాంలో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు : అచ్చెన్నాయుడు

రాష్ట్ర అభివృద్ధికి వైఎస్ జగన్ (YS Jagan) వ్యతిరేకి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన ఘనుడని వ్యాఖ్యానించారు. డాక్టర్ (Doctor) కావాలనుకునే పేద విద్యార్థుల కలలకు జగన్ అడ్డుగా నిలుస్తున్నారని ఆక్షేపించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రైవేట్ కోటాకు 50 శాతం సీట్లు కేటాయించింది జగన్ ప్రభుత్వమేనని ఆరోపించారు. మెడికల్ కళాశాలల నిర్మాణాలకు జగన్ హయాంలో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని అన్నారు. ప్రజల ఆరోగ్యానికి మేలు చేసేందుకే పీపీపీ (PPP) విధానం తీసుకొచ్చామని, ఇది ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన నమూనా అని తెలిపారు. నర్సీపట్నంలో జగన్ పర్యటన, రాజకీయ నాటకం తప్ప, ప్రజా ప్రయోజనం లేదన్నారు. ప్రజల ఆరోగ్యం, విద్య, సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అధునాతన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గంగవరం పోర్టు, విశాఖ స్టీల్‌ప్లాంట్ భూములను ప్రైవేటుకు అమ్మేసింది జగన్ ప్రభుత్వమేనని ఆరోపించారు.