జగన్ ముందు దీని మీద ఫోకస్ చేయాల్సిందే…?
ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలావరకు సీరియస్ గా ఉన్నా సరే కొన్ని కొన్ని అంశాల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు అరిశీలకులు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సరే ప్రజల వద్ద నుంచి భారీగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వం పై ఎక్కువగా వినబడుతున్నాయి. కాబట్టి ఈ అంశంలో ముఖ్యమంత్రి జగన్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు .
వాస్తవానికి 2019 ముందు రాష్ట్ర ప్రజల ఆదాయం పెరిగినా 2019 తర్వాత ప్రజలకు ఆదాయం తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉండటం అలాగే కొన్ని ఆదాయ మార్గాలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల మీద పన్నుల పేరుతో అధిక భారం వేస్తున్నారు. దీనితో మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయి. అలాగే నిత్యావసర సరుకుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగానే ఉంది.
అలాగే పెట్రోల్ ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదు. దీనితో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులు కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను దూరం చేస్తున్నాయి. ఈ విషయాల్లో ముఖ్యమంత్రి జగన్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అంతే కాకుండా కొన్ని కొన్ని ఆదాయ మార్గాల మీద దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద భారం వేసే దిశగా అడుగులు వేస్తోంది.
దీనివలన ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది అని చెప్పాలి. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా సరే ప్రజల వద్ద నుంచి భారీగా వసూలు చేస్తే మాత్రం ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగే అవకాశాలుంటాయి. ప్రజలు ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు అయినా తమకు వచ్చేది ఎంత, పోయేది ఎంత అన్నే దాని మీద లెక్కలు వేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని సీరియస్ గా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వింత వింత పన్నులు కూడా ఏపీలో వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసిపి బలంగా ఉన్నా సీఎం జగన్ పరిపాలన పై వ్యతిరేకత పెరిగే అవకాశాలు ఉన్నాయి. విపక్షం బలహీనంగా ఉండటంతో మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించింది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం క్షేత్రస్థాయిలో వైసిపి నష్టపోయే అవకాశాలు ఉండవచ్చు.













