Jagan getting ready to strike back: చంద్రబాబు సొంత జిల్లా నుంచి పర్యటన షురూ చేయనున్న జగన్..
వైసిపి అధినేత.. ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ (Jagan) గత కొద్దికాలంగా పాటిస్తున్న మౌనానికి ఎట్టకేలకు ఉద్వాసన పలికారు. తాజాగా పక్కగా టూర్లు ప్లాన్ చేసుకొని మరి కూటమిపై దాడికి సిద్ధమవుతున్నారు. కూటమి జూన్ 11న ఆంధ్రాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.. అంటే డిసెంబర్ నాటికి కూటమి ఏర్పాటై ఆరు నెలలు పూర్తి అవుతుంది.. ఈ నేపథ్యంలో జగన్ డిసెంబర్ నుంచి జనంలోకి రావడానికి రెడీ అవుతున్నారు.
జగన్ జిల్లాల పర్యటనకు సంబంధించిన రోడ్ మ్యాప్ కూడా రెడీ అవుతోంది. ఒక వ్యూహం ప్రకారం జగన్ కొన్ని కీలకమైన ప్రాంతాలను పర్యటన కోసం ప్రత్యేకంగా ఎంచుకోవడానికి భావిస్తున్నారట. ఎప్పటినుంచో జగన్ కు హార్డ్ కోర్ ఫాన్స్ అయిన రాయలసీమ జిల్లాలు (Rayalaseema) కూడా 2024 ఎన్నికల్లో జగన్ ముంచేశాయి. దీంతో తిరిగి అక్కడ నుంచే తన టూర్ ని ప్రారంభించడానికి జగన్ భావిస్తున్నారు. ఇక అనంతరం నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కూడా జగన్ టచ్ చేస్తారు.
ఇలా మొత్తానికి 74 నియోజకవర్గాలలో పర్యటించి పోయిన పార్టీ ప్రతిష్టను తిరిగి తేవడానికి జగన్ (Jagan) వ్యూహం సిద్ధం చేస్తున్నారు అని టాక్. ఈ నేపథ్యంలో కూటమి ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో కూడా జగన్ తీవ్రంగా ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు నుంచి జగన్ తన పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ఎన్నో విధానాలను ప్రశ్నించడంతోపాటు హామీల గురించి కూడా గట్టిగానే అడిగేలా ఉన్నారు.
సిక్స్ మంత్స్ పూర్తయింది బాబు నీ సూపర్ సిక్స్ (super six) ఎక్కడ వరకు వచ్చింది.. అని జగన్ స్పందించే బాణాలకు కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఎంతో కొంత నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్న అక్కడక్కడ ప్రజలలో ఈ విషయంపై అసంతృప్తి మెల్లిగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో జగన్ ఈ విషయాన్ని పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.













