చంద్రబాబు సున్నా.. పక్కన ఎందరు చేరినా పర్లేదు.. జగన్ వైరల్ స్టేట్మెంట్..
ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ తరుణంలో త్వరలోనే తమ మేనిఫెస్టో విడుదల చేస్తాము అని జగన్ పేర్కొన్నారు. అంతేకాదు సమాధానం చేయగలిగింది మాత్రమే చెబుతామని.. చెప్పిన ప్రతి పని చేసి తీరుతామని ఆయన అన్నారు. ఒక్కసారి జగన్ మాట ఇచ్చాడు అంటే ఇక తగ్గేదే లేదు అంటూ బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరిగిన నాలుగో సిద్ధం బహిరంగ సభలో జగన్ వెల్లడించారు. 14 సంవత్సరాల సీఎంగా ఉన్న చంద్రబాబు చేసింది ఏమీ లేదని.. మేనిఫెస్టోను చెప్పడం మాత్రమే కానీ.. వాటిని అమలు చేసిన దాఖలు లేదని ఆయన విమర్శించారు. చంద్రబాబు మేనిఫెస్టోని శకుని చేతిలోని పాచికలతో జగన్ పోల్చడం విశేషం. సున్నా వెనుక ఎన్ని అంకెలు పడ్డా వాటికి విలువ ఉండదు.. అలాగే అలాంటి చంద్రబాబు వెనక ఎన్ని పార్టీలు నిలుచుకున్నా ప్రయోజనం లేదు అని జగన్ వ్యాఖ్యానించారు. 2014లో కూటమిగా ఏర్పడిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు.. చెప్పిన మేనిఫెస్టోలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చలేదని జగన్ ఎద్దేవా చేశారు. ఈసారి కూడా ప్రజల సపోర్టుతో గెలిచేది తామే అన్న ధీమా జగన్ మాటల్లో స్పష్టంగా వ్యక్తం అవుతోంది.













