ప్రజలే నా నమ్మకం.. నా బలం.. జగన్
ఎన్నికల ప్రచారానికి జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం సభ లో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లాలోని తుగ్గలి గ్రామంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రజలను ఉద్దేశించి ప్రస్తావించిన జగన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తమ పాలన వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ లంచాలు అడిగే వారు లేరు అని జగన్ అన్నారు. ఎక్కడ ఎటువంటి వివక్షత చూపించకుండా కులమతాలకు అతీతంగా.. రాజకీయపరమైన ఒత్తిడి లేకుండా.. తమ పాలన ఉందని జగన్ అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందే విధంగా చూసిన ప్రభుత్వం తమ ప్రభుత్వం అని ఆయన అన్నారు. మీ భవిష్యత్తు కోసం ఎన్నో బటన్ లు నొక్కిన మీ బిడ్డ భవిష్యత్తు కోసం ఒక్క బటన్ నొక్కండి అని జగన్ అన్నారు. తుగ్గలి ప్రజలు కూడా తమ పథకాల వల్ల ఎంతో లబ్ధి పొందారు అన్న విషయాన్ని జగన్ మరొకసారి ఈ సభలో గుర్తు చేశారు. ఇక తమ పార్టీని గెలిపించే బాధ్యత ప్రజలదేనని ఆయన అన్నారు.













