టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్యామలరావు

శ్రీవారికి నిత్య కైంకర్యాలు సక్రమంగా జరిగేలా చూడటంతో పాటు భక్తులకు మెరుగైన సదుపాయాల కల్పన పైనే ప్రధానంగా దృషి సారించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన ఈవో శ్యామలరావు తెలిపారు. భక్తులకు అవసరమైన వసతులు, భోజనం, దర్శనం, రవాణా వంటివి మరింత మెరుగుపరుస్తామన్నారు. టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పనినే దైవంగా భావిస్తానని, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. టీటీడీ విషయంలో సీఎంకు విజన్ ఉందని, దానికి అనుగుణంగా అభివృద్ధి చేస్తామని వెల్లడిరచారు. ఇక్కడ జరుగుతున్న అన్ని కార్యక్రమాలను పున పరిశీలిస్తామన్నారు. ఎక్కడైనా నిధుల దుర్వినియోగం, అక్రమాలు జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.