అమరావతిలో ఐటీ టవర్
ఆంధ్రప్రదేశ్ రాజధానికి నిర్మించే ఐకానిక్ ఐటి టవర్ డిజైన్ చరిత్రలో గుర్తుండిపోయేలా ఉండాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ టవర్‌కు సంబంధించి వివిధ సంస్థలు రూపొందించిన డిజైన్లను ఏపీసీఆర్డీఏ అధికారులు ఆయనకు, ఐటీ శాఖాధికారులకు చూపారు. హైదరాబాద్ పేరు చెప్పగానే సైబర్ టవర్ గుర్తొచ్చినట్టే, అమరావతి అనగానే ఈ ఐటీ భవంతే స్ఫురణకు రావాలి. ప్రస్తుత డిజైన్లను మరింత మెరుగుపర్చి ఆకృతులను సిద్ధం చేయాలని ఈ సందర్బంగా లోకేష్ సూచించారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్, సీఆర్డీయే కమిషనర్ శ్రీధర్ పాల్గొన్నారు.













