సీఎం జగన్ కి ఓటమి భయం.. అందుకే
రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాలని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు తమను కోరుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పరిటాల రవి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థిని నిలబెడితే ఓటేసి గెలిపిస్తామని 50 మంది ఎమ్మెల్యే సంప్రదిస్తున్నారని తెలిపారు. సీఎం జగన్కు ఓటమి భయం పట్టుకుంది. అందుకే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఇప్పుడు ఆమోదింపజేశారు. రాష్ట్రం బాగుండాలనే చాలా మంది టీడీపీలో చేరుతున్నారు. అంబేడ్కర్ విగ్రహం పేరుతో దోపిడి చేశారు. జగన్ పాలనలో సామాజిక న్యాయం ఎక్కుడుంది? కేసుల నుంచి తప్పించుకోవడం ఆయనకు అలవాటైపోయింది అని విమర్శించారు.













