ఎమ్మెల్యేల కంటే సినిమా వాళ్ళంటేనే జగన్ కు నమ్మకమా ఏంటీ…?
ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా ఉన్నారు. అయితే సంక్షేమ కార్యక్రమాలు ప్రచారం చేసే విషయంలో మాత్రం వైసిపి నేతలు ఘోరంగా విఫలమవుతున్నారు అనే ఆరోపణలు వినపడుతున్నాయి. దాదాపు రెండేళ్ళు అయినా సరే వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లే విషయంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు హైదరాబాదులో లేకపోతే బెంగళూరులో ఉంటూ వ్యాపారాలు చేసుకుంటున్నారు. మరికొంతమంది చెన్నైలో ఉంటూ అసలు రాష్ట్రానికి కూడా వచ్చే ప్రయత్నం చేయటం లేదు.
దీనితో పార్టీ కార్యకర్తలు అలాగే స్థానిక నాయకులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే చెప్పాలి. పంచాయతీ ఎన్నికల్లో కూడా కొంతమంది నుంచి పార్టీకి పెద్దగా సహకారం వచ్చిన పరిస్థితి కనబడలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని చర్యలకు దిగే అవకాశాలు కనబడుతున్నాయి. వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే ఇప్పటివరకు కూడా ఎమ్మెల్యేలను నమ్ముకున్న ముఖ్యమంత్రి జగన్ ఇక నుంచి మాత్రం సినీ నటులను నమ్ముకునే ఆలోచనలో ఉన్నారని వైసిపి వర్గాలు అంటున్నాయి.
సినీ నటుల ద్వారా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రచారం చేయించడానికి సీఎం జగన్ రెడీ అయినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మాజీ హీరోయిన్ లతో పాటుగా ప్రస్తుత హీరోయిన్లను కొంతమందిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు ప్రసార సమాచార శాఖ కొన్ని ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్టు గా టాక్. వారి ద్వారా కొన్ని కీలక సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రచారం చేయిస్తే మంచిది అనే భావన ముఖ్యమంత్రి జగన్ లో ఉందని చెప్పాలి.
అందుకే ఇప్పుడు వారితో చర్చలు జరుపుతున్నారని టాలీవుడ్ లో ఒకరిద్దరు హీరోల ద్వారా కూడా ఇప్పుడు ప్రచారం చేయిస్తే బాగుంటుంది అనే భావనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని వైసిపి వర్గాలు అంటున్నాయి. మరి ఈ రాజకీయం అధికార పార్టీకి ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి. ముఖ్యమంత్రి కొంతమంది హీరోల తో ప్రచారం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇక తమిళనాడుకు చెందిన మాజీ హీరోయిన్ తో కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని కీలక సంక్షేమ కార్యక్రమాలకు ప్రచారం చేయిస్తే బాగుంటుందని భావిస్తున్నారు.
వైసీపీ ఎమ్మెల్యేలు విఫలం కావడంతో వీరి ద్వారా ముందుకు వెళితే మంచి ఫలితాలు ఉంటాయని జగన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మధ్యతరగతి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కానీ వాటిని ప్రజల్లోకి తీసుకు వెళ్ళ లేకపోతున్నారు. అలాగే విద్యార్థుల కోసం కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటన్నింటినీ కూడా ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రచారం చేయించడానికి జగన్ రెడీ అయ్యారు.













