PV Sunil Kumar : ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్ పొడిగింపు

ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్ సస్పెన్షన్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 వరకు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం అనుమతి లేకుండా విదేశీ పర్యటనలకు వెళ్లారన్న అభియోగాలు నిరూపణ కావడంతో ఆయన్ను ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ (Suspended ) చేసింది. మరో రెండు రోజుల్లో సస్పెన్షన్ గడువు ముగియనుండటంతో రివ్వూయ కమిటీ సమీక్ష నిర్వహించింది. అగ్రిగోల్డ్ (Agrigold) నిధుల దుర్వినియోగంపై సునీల్ కుమార్‌పై ఏసీబీ(ACB) విచారణ కొనసాగుతోంది.